బాలికపై యాసిడ్‌ దాడి కేసులో నిందితుడి అరెస్ట్‌ 

8 Sep, 2022 05:14 IST|Sakshi

నెల్లూరు(క్రైమ్‌): బాలికపై యాసిడ్‌తో దాడి చేసి గొంతుకోసి నగదు, బంగారంతో ఉడాయించిన ఘటనలో నిందితుడు నాగరాజును బుధవారం నెల్లూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్పీ సీహెచ్‌ విజయారావు వివరాలు వెల్లడించారు. వెంకటాచలం మండలం చెముడుగుంట నక్కల కాలనీకి చెందిన దంపతులకు 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక మేనత్త కుమారుడు నెల్లూరు నాగరాజు వ్యసనాలకు బానిసై ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.  

ఈ నెల 5వ తేదీ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఆమెపై యాసిడ్‌తో దాడి చేసి చెవి కమ్మలు దోచుకుని ఆమె గొంతుకోశాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మృతి చెందిందనుకుని బీరువాలోని రూ.నాలుగు వేలు దోచుకెళ్లాడు. కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు నిందితుడిని అతని ఇంటి వద్దే అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు, యాసిడ్‌ బాటిల్, కత్తి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సీ వివరించారు.   

మరిన్ని వార్తలు