డాక్టర్‌ ప్రియాంక సూసైడ్‌ కేసులో పురోగతి

24 Jan, 2021 14:20 IST|Sakshi

విజయవాడ: విజయవాడలో కలకలం రేపిన డాక్టర్ ప్రియాంక సూసైడ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ నవీన్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31న భవానీపురంలోని ఇంట్లో వైద్యురాలు ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్‌ నవీన్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్టు ఆమె సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. 

ప్రియాంక ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం మదనపల్లి, నెల్లూరు, కర్నూలులో గాలింపు చేపట్టగా, ఆదివారం కర్నూలులో పోలీసులకు చిక్కాడు. సూసైడ్ లెటర్ ఆధారంగా డాక్టర్ నవీన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డాక్టర్‌ ప్రియాంక ఆత్యహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు