దివ్యాంగ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు

6 Sep, 2023 04:40 IST|Sakshi

 బతికి ఉన్నంత వరకు జైల్లో పెట్టాలని విజయవాడ పోక్సో కోర్టు తీర్పు

విజయవాడ స్పోర్ట్స్‌: దివ్యాంగ బాలిక(13)పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మరణించే వరకు (జీ వి త ఖైదు) జైలు శిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్‌ ఎస్‌.రజిని మంగళవారం తీర్పు చెప్పారు. విజయవాడ సీవీఆర్‌ ఫ్లై ఓవర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో తన అక్క కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ బాలికను ఈ ఏడాది జనవరి 17వ తేదీన తా ను పని చేసే కంపెనీ వద్దకు ఆమె తీసుకువెళ్లింది. ఆమె పని చేస్తుండగా, కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించలేదు.

కంపెనీ సెక్యూరిటీ సహాయంతో చుట్టుపక్కల వెదుకుతుండగా, సమీపంలోనే ఓ షాపు వెనుక ముళ్లపొదల వద్ద ఆ బాలికపై ఒక వ్యక్తి లైంగికదాడికి పాల్పడుతుండటంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అఘాయిత్యానికి పాల్పడుతున్న వ్యక్తి పారిపోయాడు. బాలిక సైగల ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడి నది డ్రైవర్‌ రమేష్‌ అని గుర్తించి ఆమె కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లా పాములపాడుకు చెందిన రమేష్‌ విజయవాడ వన్‌టౌన్‌ మిల్క్‌ ప్రాజెక్ట్‌ సమీపంలో నివాసం ఉంటూ బొలెరో వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు పోలీ సు విచారణలో తేలింది. దిశా ఏసీపీ వీవీ నాయు డు ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరించారు.

దిశా, సీఎంఎస్‌ అధికారుల సమక్షంలో 25 మంది సాక్షులను న్యాయమూర్తి విచారించారు. బాధితు రాలి తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు రమేష్ కు మరణించే వరకు జైలు శిక్షతోపాటు రూ.30 వేలను జరిమానాగా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు చెల్లించిన జరిమా నా రూ.30వేలు, మరో రూ. 50వేలను బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయ మూర్తి ఆదేశించారు. ఈ ఘటన జరిగిన ఎనిమిది నెలల్లోనే న్యాయస్థానం తీర్పు వెలువరించేలా ట్రయిల్‌ నిర్వహించిన పోలీసులను సీపీ టీకే రాణా అభినందించారు.

మరిన్ని వార్తలు