డ్రగ్స్‌ కేసులో వివాదాస్పద బాలీవుడ్‌ నటుడు అరెస్టు

31 Mar, 2021 09:05 IST|Sakshi

వివాదాస్పద నటుడు అజాజ్‌ ఖాన్‌కు ఎన్‌సీబీ షాక్‌ 

ముంబై విమానాశ్రయంలో అరెస్ట్‌

సాక్షి,ముంబై: వివాదాస్పద బాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్-7 ఫేమ్‌ అజాజ్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) షాక్ ఇచ్చింది. రాజస్తాన్‌ నుంచి మంగళవారం ముంబైకు చేరిన ఖాన్‌ను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాల కేసులో అజాజ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌సీబీ అధికారి తెలిపారు.

మాదకద్రవ్యాల పెడ్లర్ షాదాబ్ బటాటాను ప్రశ్నించినప్పుడు ఖాన్ పేరు వెలుగులోకి రావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నగరంలోని అంధేరి, లోఖండ్‌వాలా ప్రాంతాల్లో ఎన్‌సీబీ దాడులు చేపట్టింది. అనంతరం అజాజ్‌ను ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్‌సీబీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఖాన్ తనను ఎవరూ అదుపులోకి తీసుకోలేదని తానే అధికారులను కలవడానికి వచ్చానని పేర్కొన్నాడు. (ఆ ఒక్కమాటతో ఆఫర్‌ వచ్చింది.. మళ్లీ పనిచేయాలని ఉంది)


తరచూ వివాదాస్పద వ్యాఖ‍్యలతో వార్తల్లో ఉండే ఖాన్‌పై మాదకద్రవ్యాల ఆరోపణలు రావడం మొదటిసారి కాదు. డ్రగ్స్ కేసులో 2018లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు, నోటి దురుసుతో తరచూ చర్చల్లో నిలిచే ఖాన్‌ను జూలై 2019 లో అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేసినందుకు,  2020 ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్ట్‌ను అప్‌లోడ్ చేసినందుకు అరెస్టు చేశారు. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అజాజ్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్-7 లోకి ఎంట్రీ ఇచ్చిన ఖాన్‌ సీజన్ 8లో కూడా కనిపించాడు. అనేక టీవీ షోలతోపాటు, శక్తి చరిత్రా, భోండు, అల్లాహ్ కే బండే, రక్త చరిత్రా 2, హై తుజే సలాం ఇండియా లాంటి సినిమాల్లోనూ  నటించాడుఖాన్‌. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు