రహస్య వీడియోల కేసులో పోలీసులకు లంచం ఇవ్వచూపిన హీరోయిన్‌

31 Jul, 2021 15:54 IST|Sakshi
గెహన వశిష్ట్‌

ముంబై: ఈ ఏడాది ప్రారంభం నుంచి బాలీవుడ్‌ను పలు కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ రాకెట్‌ కేసు బాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. బాలీవుడ్‌ అగ్రనటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అశ్లీల వెబ్‌సిరీస్‌, సినిమాలు తీశారనే ఆరోపణలతో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులతో మరికొందరికి సంబంధాలు ఉన్నాయనే వార్తలు బాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. అయితే ఈ రాకెట్‌ ఆనవాళ్లు ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉన్నాయి. పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఓ హీరోయిన్‌ పోలీసులకు లంచం ఇవ్వజూపారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్నోగ్రఫీ కేసులో హీరోయిన్‌ గెహన వశిష్ట్‌ అరెస్ట్‌ అయ్యారు. అయితే ఈ అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు రూ.15 లక్షలు లంచంగా ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. ఆమెను అరెస్ట్‌ చేయడానికి వచ్చిన పోలీసులతో ‘నన్ను అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు మీకెంత కావాల్నో చెప్పండి’ అని పోలీసులకే ఆఫర్‌ ఇచ్చారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక చివరగా రూ.15 లక్షలు ఇస్తాను అని గెహన పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుందని దర్యాప్తులో తేలింది. అయితే లంచం పోలీసులే డిమాండ్‌ చేశారని గెహన ఆరోపిస్తోంది.

ఈ కేసు విషయంలోనూ ఇద్దరితో వాట్సప్‌ చాటింగ్‌ చేసినట్లు గుర్తించారు. వారే యశ్‌ ఠాకూర్‌ అలియాస్‌ అర్వింద్‌ కుమార్‌ శ్రీవాస్తవ, తన్వీర్‌ హష్మీ. వీరితో ఈ కేసు విషయమై చాటింగ్‌ చేసింది. పోలీసులు లంచం అడగడంతో వారిద్దరూ కలిపి రూ.8 లక్షల వరకు సమకూర్చగలరని ఆ చాటింగ్‌లో ఉంది. గెహనా నటించిన మూడు అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలతో రాజ్‌కుంద్రాకు చెందిన కంపెనీలో ఉన్న వ్యాపారవేత్త కాస్త నిర్మాతగా మారిన వ్యక్తికి సంబంధం ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు