రెండేళ్ల ప్రేమ.. ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకుంటాను అనడంతో...

29 Sep, 2021 10:34 IST|Sakshi
గంగుబాయి (ఫైల్‌) 

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

సాక్షి, ఆదిలాబాద్‌: మండలంలోని అంకాపూర్‌కు చెందిన మర్సుకోల గంగుబాయి (18) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాలు.. జైనథ్‌ మండలం జామ్నికి చెందిన పెందూర్‌ రవీందర్, గంగుబాయి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వేరే యువతిని వివాహం చేసుకుంటానని రవీందర్‌ తెలపడంతో గంగుబాయి మనస్తాపం చెంది ఈనెల 24న పురుగుల మందు తాగింది.
చదవండి: మరో వ్యక్తితో వివాహం.. ప్రియునితో కలిసి వివాహిత ఆత్మహత్య

గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తల్లి శోభబాయి ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చదవండి: మరొకరితో పెళ్లి.. హైదరాబాద్‌కు వెళ్తూ ప్రియున్ని రమ్మని..

మరిన్ని వార్తలు