తండ్రి లైంగిక వేధింపులు: కాల్చి పడేసిన కూతురు

23 Mar, 2021 12:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతాలో వెలుగు చేసిన ఘటన

కోల్‌కతా: బాల్యంలోనే తల్లి చనిపోయింది. అమ్మనాన్న తానే అయి ప్రేమను పంచి కాపాడాల్సిన తండ్రి.. తనపై కన్నేశాడు. లైంగికంగా వేధిస్తూ.. మానసికంగా హింసిస్తూ.. నరకం చూపించాడు. వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లే వరకు ప్రతిరోజు కన్నీళ్లే. అత్తారింటికి వెళ్లాక ఈ బాధలు తప్పుతాయనుకుంటే.. దురదృష్టం కొద్ది వివాహ బంధం ఎక్కువ రోజులు సాజవుగా సాగలేదు. విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. దాంతో మళ్లీ పుట్టింటికి చేరింది. తండ్రి టార్చర్‌ తిరిగి మొదలయ్యింది. ఈ బాధలను భరించలేకపోయిన ఆ మహిళ ఓ దారుణ నిర్ణయం తీసుకుంది. తనకు నరకం చూపిస్తున్న తండ్రిని కడతేర్చింది. 

ఆ వివరాలు.. కోల్‌కతాకు చెందిన మహిళ తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. అప్పటి నుంచి తండ్రి ఆమెని లైంగికంగా హింసించేవాడు. తన వివాహం అయ్యే వరకు ఈ కష్టాలు భరించింది. కానీ దురదృష్టం కొద్ది విడాకలు తీసుకుని మళ్లీ తండ్రి పంచన చేరాల్సి వచ్చింది. దాంతో మళ్లీ టార్చర్‌ మొదలు. ఈ బాధలు భరించలేక పోయిన యువతి తండ్రిని హతమార్చలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తండ్రి బిడ్డలిద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. తిన్న తర్వాత తండ్రి చేత ఫుల్లుగా మద్యం తాగించింది. ఆ తర్వాత ఇద్దరు హూగ్లీ నది ఒడ్డున ఉన్న బెంచీ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. మందు ఎక్కువ కావడంతోతండ్రి మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. 

ఈ క్రమంలో మహిళ అప్పటికే తెచ్చి పెట్టుకున్న కిరోసిన్‌ని తండ్రి మీద పోసి నిప్పంటించింది. ఈ దృశ్యాలన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు విచారణలో నిందితురాలు తండ్రి చిన్నతనం నుంచి తనను ఎలా హింసిస్తుంది వివరించింది. ఆ బాధలు తట్టుకోలేక అతడిని చంపేసినట్లు అంగీకరించింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: లైంగికదాడి చేయబోయాడు; కోలుకోలేని దెబ్బకొట్టింది!

మరిన్ని వార్తలు