మంజీరలో ఏఓ గల్లంతు? 

27 Nov, 2020 05:32 IST|Sakshi
అరుణ (ఫైల్‌)

గాలింపు చేపట్టిన పోలీసులు 

ఆత్మహత్య చేసుకొంటానని కుటుంబ సభ్యులకు ఫోన్‌ 

కుటుంబ కలహాలే కారణమని అనుమానం 

మనూరు(నారాయణఖేడ్‌): సంగారెడ్డిలోని రైతు శిక్షణకేంద్రంలో అరుణ(34) ఏఓగా పనిచేస్తోంది. గురువారం సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్‌కు వస్తున్న క్రమంలో మనూరు మండలం రాయిపల్లి వద్ద మంజీరలోకి దూకి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు  నారాయణఖేడ్‌ మండలం పైడిపల్లిలోని వరుసకు తమ్ముడైన పవన్‌కు ఫోన్‌ చేసింది. విషయం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు వంతెన వద్దకు చేరుకున్నారు. వంతెనవద్ద ఉన్న టీఎస్‌15 ఈడీ0403 కారులో యువతి హ్యండ్‌బ్యాగు, చెప్పులు ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున ఎస్‌ఐ నరేందర్‌ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీంతో చుట్టుపక్కలవారితో విచారించారు. ఆమె కోసం నదిలో గాలింపు చేపట్టారు. యువతి ఆచూకీ లభించకపోవడంతో తమ్ముడు శేరి శివకుమార్‌ ఫిర్యాదుమేరకు గల్లంతు కేసుగా నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు. కాగా సంఘటన స్థలానికి ఖేడ్‌ సీఐ రవీందర్‌రెడ్డి, రాయికోడ్‌ ఎస్‌ఐ ఏడుకొండలు చేరుకుని వివరాలు అడిగితెలుసుకున్నారు.  

అలుముకున్న విషాదఛాయలు 
అరుణ గల్లంతుతో ఖేడ్‌లో విశాద ఛాయలు అలుముకున్నాయి. ఈమె గతంలో మనూరు, నారాయణఖేడ్, కల్హేర్‌ ఏఓగా పనిచేసింది. 2016లో మోర్గికి చెందిన శివశంకర్‌తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు రుద్రవీర్, 11 నెలల విరాట్‌ ఉన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా