అగ్రిగోల్డ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం

23 Dec, 2020 12:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ ప్రమోటర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) బుధవారం కోర్టులో హాజరుపరిచింది. మనీలాండరింగ్ చట్టం కింద అగ్రిగోల్డ్‌పై ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. ఈ క్రమంలోనే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్రావును ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా, వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఏపీ, తెలంగాణ, కర్నాటకలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. అగ్రిగోల్డ్ సుమారు 32 లక్షల మందిని రూ.6380 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఈడీ అధికారులు పేన్నారు. రూ.942 కోట్ల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు అగ్రిగోల్డ్ మల్లించినట్టు ఈడీ అధికారలు గుర్తించారు. గతంలో జరిపిన సోదాల్లో రూ.22 లక్షల నగదు, పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు