బ్లాక్‌ ఫంగస్‌ సోకిందేమోననే భయంతో..

31 May, 2021 20:01 IST|Sakshi

అహ్మ‌దాబాద్: కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడు బ్లాక్ ఫంగ‌స్ సోకింద‌నే భ‌యంతో విషం తాగి ఆత్మ‌హ‌త్యకు పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న అహ్మ‌దాబాద్‌లో వెలుగుచూసింది.  అతను తన భార్యతో కలిసి అహ్మదాబాద్ పాల్ధి ప్రాంతంలోని అమన్ అపార్టుమెంటులో నివసిస్తున్నాడు. మే 27న అతని పుట్టినరోజు కాగా.. అదే రోజు త‌న శరీరంపై తెల్ల మ‌చ్చ‌లు, ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్‌ను గుర్తించి ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి అనుకొని విషం సేవించి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

బ్లాక్ ఫంగ‌స్ వ‌ల్లే త‌న శ‌రీరంపై మ‌చ్చ‌లు వ‌చ్చాయ‌నే భ‌యంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. కాగా నాలుగు నెలల ముందు క‌రోనా సోకగా ఒక నెలలో మహమ్మారి బారి నుంచి పటేల్‌ కోలుకున్నాడు. అయితే అతను  మ‌ధుమేహం, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నందున బ్లాక్ ఫంగ‌స్ దాడి నుంచి తాను త‌ప్పించుకోలేన‌ని భ‌య‌ప‌డిన‌ట్టు స్ధానిక ఎస్ఐ జేఎం సోలంకి వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని తెలిపారు.

చదవండి: పెళ్లి జరిగి 4 రోజులు.. భర్త ముందే మాజీ ప్రియుడు..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు