ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ

14 Jan, 2021 11:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియ పోలీస్‌ కస్టడీ ముగిసింది. కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జడ్జి నివాసంలో అఖిల ప్రియను హాజరపరిచి.. చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. కాగా, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ సొంత పాంహౌజ్‌లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. (చదవండి: కిడ్నాప్‌ ప్లానంతా అతని కనుసన్నల్లోనే..

ఇప్పటి వరకు అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. ఈ కేసులో నిందితులైన భార్గవ్‌రామ్‌, చంద్రహాస్‌, గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీశారు. టెక్నికల్‌ సాక్ష్యాలను అఖిలప్రియ ముందు ఉంచటంతో.. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భార్గవ్‌, గుంటూరు శ్రీను, జగత్‌ విఖ్యాత్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. చదవండి: అక్షయ్‌ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ

మరిన్ని వార్తలు