దారుణం: రెండేళ్లుగా గ్యాంగ్‌రేప్‌, నెట్టింట్లో వీడియో

2 Jul, 2021 12:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాజస్థాన్‌, అల్వార్‌లో దారుణం

మొదటి ఫిర్యాదును  పోలీసులు పట్టించుకోని వైనం

రెండేళ్లుగా తమ అమానుషాన్ని కొనసాగించిన నిందితులు

నెట్టింట్లో  వీడియో హల్‌ చల్‌, ముగ్గురు అరెస్ట్‌

అల్వార్: రాజస్థాన్‌ అల్వార్ జిల్లాలో చోటుచేసుకున్న అమానుష ఘటన ఆలస‍్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్లుగా ఒక యువతి(20)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  దీనిపై మొదట ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడటంతోనే ఈ దారుణం  కొనసాగిందని బాధితురాలు వాపోయింది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. తనను కిడ్నాప్‌ చేసి ,సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారంటూ ముగ్గురిపై 2019 ఏప్రిల్‌లో అల్వార్‌లోని మలఖేరా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే నిందితులపై  ఎలాంటి కేసు కేసు నమోదుకాకపోవడంతో మేనెలలో మరోసారి పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు. కేసూ లేదు, విచారణ లేదు.. కనీసం చర్యలు అసలే లేవు. దీన్ని అలుసుగా తీసుకొన్న దుండగులు మరింత రెచ్చిపోయారు. అత్యాచార వీడియో సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించి మరీ గత రెండేళ్లుగా తమ అరాచకాన్ని పలుమారు కొనసాగిస్తూ ఇచ్చారు.  

అక్కడితో వాళ్ల ఆగడాలకు చెక్‌ పడలేదు. రేప్‌ వీడియోను ఈ ఏడాది జూన్‌ 25న బాధితురాలికి పంపించాడు నిందితుల్లో ఒకడైన గౌతం సైనీ. తనతో గడపాలని, లేదంటే ఆ వీడియోను ఆమె కుటుంబ సభ్యులతోపాటు, సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానంటూ బెదించాడు. అయితే దీన్నిఆమె పట్టించుకోకపోవడంతో రెండు రోజుల తరువాత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు జిల్లా ఎస్‌పీ తేజస్విని గౌతమ్‌ను కలిసి వేడుకోవడంతో చివరికి మహిళా పోలీస్ స్టేషన్‌లో జూన్‌ 28న ఫిర్యాదు నమోదైంది. అప్పటికే ఈ వీడియో వైరల్‌ గావడంతో పోలీసులు స్పందించక తప్పలేదు. వికాస్‌, భ్రూ జాట్‌, గౌతం సైనీ అనే ముగ్గురు నిందితులను గురువారం అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే మొదటి ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

చదవండి:  KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి..

మరిన్ని వార్తలు