ఆర్డర్‌ క్యాన్సల్‌ అయ్యిందని.. ఫోన్ కొట్టేశాడు

21 Oct, 2020 15:31 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్‌, ఎక్కువ డిస్కౌంట్‌లు వంటి వాటి వల్ల ఎక్కువ మంది కస్టమర్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఆసక్తి చూపుతున్నారు. నిత్యావసరాల నుంచి ఎలాక్ట్రానిక్‌ పరికరాల వరకు ప్రతిదానిని ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెజాన్‌ డెలివరీ బాయ్‌ ఒకరు ఆర్డర్‌ క్యాన్సల్‌ అయ్యిందంటూ కస్టమర్‌కి అబద్దం చెప్పి మొబైల్‌ని అమ్ముకున్నాడు. కస్టమర్‌ ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. వివరాలు.. ఢిల్లీ కిద్వాయ్‌ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అమెజాన్‌లో మొబైల్‌ని బుక్‌ చేశాడు. అక్టోబర్‌ 1న అది డెలివరీ కావాల్సి ఉంది. ఈ క్రమంలో డెలివరీ బాయ్‌ అతడి ఇంటికి వచ్చి.. మీ ఆర్డర్‌ క్యాన్సల్‌ అయ్యింది.. త్వరలోనే మీ డబ్బు తిరిగి రీఫండ్‌ చేస్తారని చెప్పాడు. దాంతో అతడు అమెజాన్‌ సైట్‌లోకి వెళ్లి రీఫండ్‌ గురించి కంప్లైంట్‌ చేశాడు. (చదవండి: 12 గంటల్లో 1.75 లక్షల ఫోన్ల అమ్మకం)

దీని గురించి చెక్‌ చేసిన అమెజాన్‌ అతడి మొబైల్‌ ఆల్‌రెడీ డెలివరీ చేశామని చెప్పింది. దాంతో అతడు కిద్వాయి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్‌ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. అతడిని ఢిల్లీ జవహర్‌ క్యాంప్‌కి చెందిన మనోజ్‌గా గుర్తించారు. ఇక విచారణలో డబ్బు అవసరం ఉండటంతో మొబైల్‌ని తానే అమ్ముకున్నానని తెలిపాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు