అమీర్‌పేట: బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి..

14 Jan, 2022 15:24 IST|Sakshi

సాక్షి, అమీర్‌పేట: బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చేలోగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇంట్లో దొంగలు పడి కిలో బంగారు అభరణాలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బోరబండ రాజీవ్‌నగర్‌లో గురువారం చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సాయినివాస్‌ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నెంబర్‌ 301లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు లక్ష్మి కుమారి నివాసం ఉంటోంది. ప్రకాశం జిల్లాలో బంధువు చనిపోవడంతో మంగళవారం కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు.

గురువారం తిరిగి వచ్చేసరికి ఫ్లాట్‌ మెయిన్‌ డోర్‌ తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లోని బీరువా తెరిచి ఉండటంతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన కిలో బంగారు అభరణాలు,ఫ్లాట్‌ విక్రయించగా వచ్చిన రూ. 22 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: లైంగిక నేరం: మహిళకు 100 కొరడా దెబ్బల శిక్ష!

మరిన్ని వార్తలు