ఆమ్నేషియా పబ్‌ కేసు.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌ వద్ద ఉద్రిక్తత 

3 Jun, 2022 18:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పీఎస్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాంగ్‌ రేప్‌ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బీజేపీ ధర్నాకు దిగింది. పోలీస్‌స్టేషన్‌లోకి బీజేపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎంఐఎం నేత కొడుకును తప్పించారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. తక్షణమే నిందితులను అరెస్ట్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.
చదవండి: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’

మరిన్ని వార్తలు