భగీరథ ఆచారీతో సహా 10 మంది అరెస్ట్‌

7 Nov, 2020 09:26 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలో కలకలం రేపిన యువతి కిడ్నాప్‌ కేసులో పోలీసులు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. దాంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 11కు చేరింది. వీరిలో కానిస్టేబుల్‌ భగీరథ ఆచారి కూడా ఉన్నాడు. ఇక యువతిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని భావించిన కానిస్టేబుల్‌ భగీరథ ఆచారి ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఏడుగురు పరారీలో ఉండగా.. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

ఇక ఈ కిడ్నాప్‌ కేసు జిల్లాలో కలకలం సృష్టించింది. కానిస్టేబుల్‌ భగీరథ ఆచారీ, జ్యోతిల నిశ్చితార్థం అయ్యాక ఇరు కుటుంబాల మధ్య గొడవలు రావడంతో పెళ్లి రద్దయ్యింది. ఈ క్రమంలో భగీరథ ఆచారి ఎట్టి పరిస్థితుల్లోను జ్యోతినే వివాహం చేసుకోవాలని భావించాడు. దాంతో ఈ నెల 2న టైలర్‌ షాపుకు వెళ్లిన జ్యోతిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తాడిపత్రి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండడాన్ని గమనించిన భగీరథ ఆచారి తదితరులు స్కార్పియో వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లి, మరో జిస్ట్‌ వాహనంలో వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి అవుకు, తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. మంగళవారం కోవెలకుంట్ల మార్గంలో కానిస్టేబుల్‌ భగీరథ ఆచారి, జ్యోతిలను బనగానిపల్లి సీఐ అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి స్టేట్‌మెంట్‌ ఆధారంగా చర్యలు ప్రారంభించారు. (చదవండి: ‘పది నిమిషాలు గడిస్తే నన్ను చంపేసేవాళ్లు)

మరిన్ని వార్తలు