Extramarital Affair: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు!

27 Oct, 2021 06:54 IST|Sakshi
హర్షవర్దన్‌ రాజు(ఫైల్‌)

అనంతపురం క్రైం: వివాహేతర సంబంధం పెట్టుకుని పోలీసు శాఖ పరువు తీసిన కానిస్టేబుల్‌  హర్షవర్దన్‌ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్‌ను ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప సస్పెండ్‌ చేశారు. కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన హర్షవర్దన్‌ రాజు (2018వ బ్యాచ్‌) అనంతపురం రూరల్‌ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఓ మహిళతో రెండేళ్ల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులకు ఆమె ఒక్కరే సంతానం. దీంతో కట్నకానుకల కింద రూ.20 లక్షల నగదు, పది తులాల బంగారం, కారు ఇచ్చినట్లు సమాచారం. (చదవండి: మాయమాటలు చెప్పి.. శారీరకంగా లొంగదీసుకొని.. గర్భవతిని చేసి)

కాగా..హర్షవర్దన్‌కు కొన్నేళ్ల క్రితం ఏఆర్‌ విభాగంలోని ఓ మహిళా కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమెను తరచూ ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ విషయమై భార్య అడిగితే తన చెల్లి అని చెప్పేవారు. ఓ రోజు గట్టిగా నిలదీయగా.. ‘పోలీసు శాఖలో ఇటువంటివి సహజం. లైట్‌గా తీసుకోవాలి ’ అంటూ సమాధానమిచ్చారు.  దీంతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లింది. భార్యను తిరిగి తీసుకురావడానికి ఆయన ఏనాడూ వెళ్లలేదు. చివరకు పెద్దలు పంచాయితీ చేసినా ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో బాధితురాలు, ఆమె తండ్రి  బ్రహ్మసముద్రం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో విచారణకు ఎస్పీ ఆదేశించారు.  విచారణాధికారుల నివేదిక ఆధారంగా హర్షవర్దన్‌ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు.
చదవండి: ఒంగోలు ఆస్పత్రిలో ప్రేమ..హైదరాబాద్‌కి వచ్చి కత్తితో పొడుచుకుని..    

మరిన్ని వార్తలు