టీడీపీ నాయకుల అరాచకం 

25 Sep, 2023 05:05 IST|Sakshi

కర్నూలు జిల్లా అలసందిగుత్తిలో వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి  

20 మందికి గాయాలు..  

ఆస్పత్రిలోనూ మరోసారి దాడికి యత్నం..  

ఆదోని (అర్బన్‌): కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందిగుత్తి గ్రామంలో టీడీపీ నాయకులు అరాచకానికి తెగబడ్డారు. 20 మంది వైఎస్సార్‌సీపీ నా­య­కులపై సుమారు 70 మంది టీడీపీ నాయకులు ప్రణాళికాబద్ధంగా వేట కొడవళ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు ఆదోని పోలీసుల­కు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అలసందగుత్తిలో చిగిళి తాయప్ప అనే వ్యక్తి ఇల్లు టీడీపీ నాయకుల ఇళ్ల మధ్యలో ఉంది. జంబయ్య సోమలింగ, లక్ష్మ­న్న, శంకరప్పతోపాటు మరికొంతమంది టీడీపీ నా­యకులు ఉద్దేశపూర్వకంగా చిగిళి తాయప్ప ఇంటి ముందు ఎద్దుల బండి ఆపి దానిపై కూర్చుని వారి ఇంట్లో ఉన్న మహిళలను దుర్భాషలాడారు.

ఇలా చేయడం తప్పని, బండి వేరేచోట ఆపి అక్కడే కూ­ర్చో­వాలని చెప్పడంతో చిగిళి తాయప్పపై ఆదివా­రం ఉదయం దాడి చేశారు. బాధితుడి తరఫున మా­ట్లాడేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు రాజీ కోసం వస్తున్నారని తెలుసుకుని పథకం ఇంటి మిద్దెలపై రాళ్లు, సీసాలు, కర్రలు, వేట కొడవళ్లతో 70 మంది టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి మాట్లాడేందుకు వచ్చిన 20మంది వైఎస్సార్‌సీపీ నేతలపై  టీడీపీ నేతలు దాడి చేశారు. ఉచీ్చరప్పకు తీవ్ర గాయాలు అయ్యాయని, వెంకటేశ్, భీరప్ప, భరత్‌తో పాటు మరో 17 మందికి గాయాలయ్యాలని పోలీసులు తెలిపారు.

గాయపడిన వారిని వెంటనే బంధువులు వాహనాల్లో ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు క్షతగాత్రులపై మరోసారి దాడికి యత్నిం­చా­రు. అక్కడే స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ రామాంజులు ఉండటంతో టీడీపీ నాయకులను చెదరగొట్టారు. దాడి చేసిన వారిలో జంబయ్య సోమలింగ, లక్ష్మన్న, శంకరప్ప, శీను, వెంకటేశ్, సోము, పాలబుడ్డితోపాటు మహిళలు, నాయకులు 60 మంది ఉన్న­ట్టు బాధితులు తెలిపారు. కేసులు పెడితే  దాడి చేస్తామని  టీడీపీ నాయకులు బెదిరించినట్టు వైఎస్సార్‌సీపీ నేతలు చెప్పారు.

మరిన్ని వార్తలు