పుట్టినరోజు వేడుక ఆనందం..కాసేపటికే అంతులేని విషాదం

17 May, 2022 12:14 IST|Sakshi

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆనందం క్షణాల్లో ఆవిరైంది. కన్నబిడ్డలతో కలిసి బయలుదేరిన తల్లి, ఇద్దరు బిడ్డలు, సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలిగొన్న సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

సాక్షి, మదనపల్లె టౌన్‌: తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం తానామిట్ట వద్ద బైకును లారీ ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. తంబళ్లపల్లె మండలం ఎద్దురరిపళ్లెకి చెందిన ఆటో డ్రైవర్‌ షంషీర్‌ భార్య హాజిరా(25), కుమార్తె జోయా(10), కొడుకు జునేద్‌(07)లతో కలిసి మదనపల్లె పట్టణం కరవంకలో ఉన్న అక్క రీమా కూతురు పుట్టిన రోజు వేడుకలకు సో మవారం వచ్చింది.

సాయంత్రం వరకు పుట్టిన రోజు వేడుకల్లో ఆనందంగా గడిపారు. హాజిరా తమ్ముడు ఖా దర్‌బాషా(19), తన బైకులో అక్క, పిల్లలను తీసుకుని ఎద్దులవారిపల్లెకు వెళ్తుండగా మార్గమధ్యంలో కురబలకోట మండలం ముదివేడు అంగళ్లు తానామిట్ట వద్ద ఎ దురుగా వచ్చిన లారీ బైకును ఢీకొని దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఖాదర్‌బాషా, జోయా, జునేద్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన హాజిరాను 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లె జి ల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతుల కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వారి రోదన ప్రతి చూపరులను కలచి వేసింది. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. 

ఎద్దులవారిపల్లెలో విషాద ఛాయలు 
ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో ఏ పూటకు ఆపూట ఆనందంగా జీవనం సాగిస్తున్న షంషీర్‌ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీఐ అశోక్‌కుమార్, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చదవండి: శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్‌ దాటితే మళ్లీ డిసెంబరే

మరిన్ని వార్తలు