మధురవాడ ఎన్‌ఆర్‌ఐ హత్య కేసులో వీడిన మిస్టరీ

18 Jul, 2021 18:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మధురవాడ ఎన్‌ఆర్‌ఐ హత్య కేసులో మిస్టరీ వీడింది. విశాఖపట్నం పీఎం పాలెంలో ఎన్నారై సతీష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో అతను భార్య రమ్య, ఆమె స్నేహితుడే హత్యకు సూత్ర దారులుగా తేలింది. ప్రస్తుతం విశాఖలోని పీఎం పాలెం వద్ద నివాసముంటున్న సతీష్ గతవారం రోడ్డుపై భార్యా పిల్లలతో కలిసి వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి రాడ్ తో దాడి చేయడంతో హత్యకు గురయ్యాడు.

దీనిపై భార్య రమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో దుబాయ్‌లో స్నేహితుడు సుధాకర్ రెడ్డి తో కలిసి సతీష్ కొన్ని వ్యాపారాలు నిర్వహించాడు. ఈ సందర్భంగా కొంత లావాదేవీలు తేడా రావడంతో సతీష్ ఇండియాలోనే ఉండిపోయాడు. దీనిపై ఇద్దరి మధ్య ఫోన్లో తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి ఈ దశలో సతీష్ హత్యకు గురికావడంతో అతని స్నేహితుడు సుధాకర్ రెడ్డి చేయించి ఉంటాడని రమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల విచారణలో సుధాకర్ రెడ్డి ప్రమేయం లేనట్టు తేలింది.

మరింత లోతుగా విచారణ సాగించిన తర్వాత సతీష్ భార్య రమ్య ప్రవర్తనపై అనుమానం కలిగింది ఆ మేరకు విచారణ రమ్య పదో తరగతి వరకు చదువుకున్న భాషా అనే ఫార్మా ఉద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తేలింది. వారిద్దరూ పెళ్లి అయినప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. కానీ సాధ్యపడక పోవడంతో రమ్య తన భర్త సతీష్‌ను చంపి ఆ నేరాన్ని వ్యాపార విభేదాలున్నా సుధాకర్ రెడ్డి పై నెట్టాలని భావించారు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయట పడడంతో రమ్యను ఆమె స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు