జూలో యానిమల్‌ కీపర్‌ ఆత్మహత్య

11 Jul, 2021 03:25 IST|Sakshi
జూలో మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్‌రాజు

ఆరిలోవ (విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కులో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న యానిమల్‌ కీపర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళ నుంచి కొన్నేళ్ల క్రితం విశాఖ వచ్చిన కొందరు జూలో ఏనుగుల ఎన్‌క్లోజర్‌లో యానిమల్‌ కీపర్లుగా పనిచేస్తున్నారు. వారిలో కాలియప్పన్‌ (32) భార్యతో కలసి మధురవాడ ప్రాంతం కొమ్మాదిలో నివాసముంటున్నాడు. ఆయన శుక్రవారం విధులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం నుంచి ఎన్‌క్లోజర్‌ వద్ద కనిపించలేదు.

ఎక్కడికో వెళ్లి ఉంటాడని తోటి కీపర్లు భావించారు. జింకల సఫారీ సమీపంలో ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. శనివారం విధులకు హాజరైన సిబ్బంది ఈ విషయాన్ని గమనించి జూ క్యూరేటర్‌ నందనీ సలారియాకు సమాచారమందించారు. క్యూరేటర్‌ ఫిర్యాదు మేరకు ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్‌రాజు, ఎస్‌ఐ అప్పారావు జూకు చేరుకొని వివరాలు సేకరించారు. కాలియప్పన్‌ భార్య, కుటుంబ సభ్యులను విచారించారు. అయితే కాలియప్పన్‌ మృతికి కారణాలు తెలియరాలేదు.  

మరిన్ని వార్తలు