రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్‌ నిజాలు..

24 Sep, 2022 21:33 IST|Sakshi

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని రిసార్టులో పనిచేసే రిసెప్షనిస్టును హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రిసార్టుకు వచ్చే అతిథులకు ప్రత్యేక సేవలు చేయాలని ఓనర్ పుల్‍కిత్ ఆర్య అంకిత భండారీని తీవ్ర ఒత్తిడి చేశాడని చెప్పారు. అందుకు ఆమె నిరాకరించిందని, ఈ క్రమంలోనే ఆమెతో గొవడపడి సిబ్బందితో కలిసి హత్య చేశాడని పేర్కొన్నారు. యువతి తన ఫ్రెండ్‌తో చేసిన చాటింగ్‌ను పరిశిలిస్తే తమకు ఈ విషయం తెలిసిందని డీజీపీ అశోక్ కుమార్ పేర్కొన్నారు.

మరోవైపు రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని అంకితను ఓనర్ బెదిరించాడని ఆమె ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఒకరు ఇప్పటికే ఆరోపించారు. అందుకు ఒప్పుకోనందుకే ఆమెను హత్య చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు పోలీసులు కూడా అదే విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం.

రిసార్టు ఓనర్ పుల్‌కిత్ ఆర్య ప్రముఖ బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు. ఆదివారం అదృశ్యమైన అంకితను అతడే హత్య చేశాడని తెలిసి స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓవైపు అధికారులు జేసీబీతో రిసార్టును కూల్చివేసే సమయంలో స్థానికులు వచ్చి భవనానికి నిప్పుపెట్టారు. ఈ హత్య ఉందంతో వినోద్ ఆర్య, అతని మరో కుమారుడ్ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. యువతి మృతదేహన్ని పోలుసులు శనివారం కాలువలో కనుగొన్నారు.
చదవండి: యువతి హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని సస్పెండ్ చేసిన బీజేపీ

మరిన్ని వార్తలు