హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్

26 Jan, 2022 16:59 IST|Sakshi

హైదరాబాద్‌:  డ్రగ్స్‌ కేసులో మరో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. డ్రగ్స్‌ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మరో ఇద్దరు వ్యాపారులు గజేంద్ర, విపుల్‌ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో బడా పారిశ్రామిక వేత్తలుగా కొనసాగుతున్న గజేంద్ర, విపుల్‌లు టోనీ అనే వ్యక్తి దగ్గర్నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నారు.

హైదరాబాదులో 500 కోట్ల పైచిలుకు వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు.. మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. గుర్తించిన 15 మంది వ్యాపారవేత్తల వద్ద వివరాలను సేకరిస్తున్నారు. వీరంతా రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన వారై ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు