జీవీఎల్‌పై అనుచిత వ్యాఖ్యలు, కేసు నమోదు

21 Aug, 2020 11:56 IST|Sakshi

సాక్షి, విజయవాడ: తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకునే టీడీపీ నేతల ఆగడాలు ఎక్కువయ్యాయి. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విడదల రజనీ సీఐడీ డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి చెందిన రామయ్య అనే వ్యక్తిపై ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు సీఐడీ డీజీ సునీల్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. జై తెలుగుదేశం, టీడీపీ యూత్ అనే పేర్లతో ఫేస్ బుక్ పేజీలలో రామయ్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా మాట్లాడుతున్న బీజేపీ నేతలను టీడీపీ సోషల్ మీడియా వింగ్‌ టార్గెట్ చేస్తోందని ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావును‌ ఉద్దేశించి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రామయ్య అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న సీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(విశాఖ ఇమేజ్‌ దెబ్బతీయడమే చంద్రబాబు ఆలోచన)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా