మాజీ ఐఏఎస్‌ ఇంట్లో సోదాలు.. సీఐడిని అడ్డుకున్న ఏబీఎన్‌ రాధాకృష్ణ

10 Dec, 2021 12:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్కిల్‌  డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ఏపీ సీఐడీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే.. మాజీ ఐఏఎస్‌ లక్ష్మినారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ శుక్రవారం సోదాలు నిర్వహించారు. కాగా, గతంలో ఆయన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో సలహాదారుగా పనిచేశారు. తన పదవీ కాలంలో యువకులకు శిక్షణనిచ్చే క్రమంలో..  లక్ష్మినారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని పలు అభియోగాలు నమోదయ్యాయి.

లక్ష్మినారాయణ మాజీ సీఎం చంద్రబాబు దగ్గర సీఎస్‌గా పనిచేశారు. లక్ష్మినారాయణ రూ. 242 కోట్ల నిధులను షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయ్యింది. సోదాలో భాగంగా.. ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మినారాయణ ఇంట్లో వెళ్లినప్పుడు ఏబీఎన్‌ రాధాకృష్ణ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో రాధాకృష్ణ, లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులు ఏపీ సీఐడీ అధికారులను ఇంట్లో ప్రవేశించకుండా అడ్డుకున్నారు.​ ప్రస్తుతం.. అధికారులు మాజీ ఐఏఎస్‌ ఇంట్లో  సోదాలు నిర్వహిస్తున్నారు. 

చదవండి: ఫేస్‌బుక్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి

మరిన్ని వార్తలు