AP: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు: దూకుడు పెంచిన సీఐడీ 

11 Dec, 2021 15:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో రూ.242 కోట్ల స్వాహాపై విచారణ చేపట్టింది. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని సీఐడీ విచారిస్తోంది. వీరిని వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తున్న సీఐడీ.. ఇవాళ అరెస్టు చూపించే అవకాశం ఉంది.

చదవండి: దోపిడీలో స్కిల్‌.. బాబు గ్యాంగ్‌ హల్‌'షెల్‌'

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను అడ్డుపెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసులో అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎస్‌డీఈఐ కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్న నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, సీమెన్స్, డిజైన్‌ టెక్, స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

‘ఏపీఎస్‌ఎస్‌డీసీ’లో అక్రమాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులతోపాటు పలు కంపెనీలపై రాష్ట్ర సీఐడీ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, పూణే, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ నివాసాల్లో తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లతో పాటు వారు డైరెక్టర్లుగా ఉన్న ఇతర సంస్థలకు సంబంధించిన ఆడిటింగ్‌ ఫైళ్లు, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు