నంద్యాల రిపోర్టర్‌ హత్య కేసు: దర్యాప్తునకు డీజీపీ ఆదేశం

9 Aug, 2021 12:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్‌ హత్య ఘటనపై దర్యాప్తునకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండైన కానిస్టేబుల్‌తో పాటు హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్‌ చానల్‌ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా విలేకరిగా పనిచేస్తున్న అతడిపై కక్షగట్టిన కానిస్టేబుల్‌ సుబ్బయ్య, అతడి సోదరుడు పదునైన ఆయుధంతో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు