ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్కిటెక్చర్‌ దుర్మరణం

7 May, 2022 15:15 IST|Sakshi

మైసూరు: నగరంలోని పోలీస్‌ లేఔట్‌లో నివాసముంటున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డు ఉద్యోగి కూతురు లత (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఆర్కిటెక్చర్‌గా పనిచేస్తున్న లత శుక్రవారం స్కూటర్‌లో ఆఫీసుకు వెళ్తోంది.

రింగ్‌ రోడ్డులో బండిపాళ్య వద్ద వేగంగా వచ్చిన మరో స్కూటర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లత తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. సిద్ధార్థ నగర ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

చదవండి: (పల్లెవెలుగు నుంచి ఏసీ వరకు.. అన్ని బస్సుల్లో తల్లులకు ప్రయాణం ఫ్రీ) 

మరిన్ని వార్తలు