జమ్ముకశ్మీర్‌ ఎన్‌‌కౌంటర్లో అమరుడైన ఆర్మీ జేసీఓ

19 Aug, 2021 15:40 IST|Sakshi

శ్రీనగర్‌:జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో  గురువారం ఉగ్రవాదులతో  జరిగిన ఎన్‌కౌంటర్‌లో  ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) అమరుడైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రాజౌరీలోని తనమండి బెల్ట్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు కాల్పులు తిప్పికొట్టాయని పోలీసు అధికారులు తెలిపారు. జమ్మూ డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ మాట్లాడుతూ...ఉగ్రవాదుల కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) తీవ్రంగా గాయపడ్డారని, ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఆయన అమరుడయ్యారని తెలిపారు. 

మరిన్ని వార్తలు