అర్నాబ్‌కు బెయిల్‌ నో

10 Nov, 2020 04:30 IST|Sakshi

దిగువ కోర్టుకు వెళ్లాలన్న బాంబే హైకోర్టు

ముంబై/న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామికి బాంబే హైకోర్టులో నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సోమవారం అర్నాబ్‌ బెయిల్‌ అర్జీని పరిశీలించిన డివిజన్‌ బెంచ్‌..బెయిల్‌ కోసం దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది. సెషన్స్‌ కోర్టు దీనిపై నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.  ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న 2018నాటి కేసులో ఆయన్ను ఈ నెల 4న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాయిగఢ్‌ జిల్లా కోర్టు అర్నాబ్‌కు  18 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.  

రిపబ్లిక్‌ టీవీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలను టీవీ చానళ్లలో చూపడం, సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడం ఆపివేస్తున్నామంటూ హామీ ఇవ్వాలని ఏజీఆర్‌ మీడియా, బెన్నెట్‌ కోల్‌మన్‌ కంపెనీలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తమపై బాధ్యతరాహితంగా వ్యాఖ్యలు చేస్తున్నాయంటూ ఈ సంస్థలపై  బాలీవుడ్‌ నిర్మాతలు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. సామాజిక మాధ్యమాలైన గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు కూడా నోటీసులిచ్చింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు