నా కూతురి పెళ్లిని కోటి రూపాయలతో నిర్వహించండి అంటూ..ఓ తండ్రి..

29 Jan, 2023 16:34 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యాపారి సూసైడ్‌ నోట్‌ తీవ్ర కలకలం రేపింది. అతను చనిపోవడానికి ముందు ఓ వీడియో తీసుకున్నాడు. అందులో నా కూతురు పెళ్లిని దాదాపు ఒక కోటి రూపాయాలు ఖర్చుపెట్టి నిర్వహించండి అని చెప్పడం అందర్నీ కంటతడిపెట్టించింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..సంజయ్‌ సేథ్‌ అనే ప్రముఖ వ్యాపారి తన​ భార్య మీనుతో కలిసి మధ్యప్రదేశ్‌లోని కిషోర్‌గంజ్‌ అనే ప్రాంతంలో నివస్తున్నాడు. ఏమోందో ఏమో! తన భార్యను హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సంజయ్‌ సేథ్‌. ఈ ఘటన జరిగినప్పుడూ ఆ గదిలో వారిద్దరే ఉన్నారు.

ఆ కాల్పుల శబ్దం విని కుటుంబసభ్యులు వచ్చి చూడగా..అతడి భార్య మృతి చెందగా, సంజయ్‌ కొన ఊపిరితో కొట్టుకుంటూ కనిపించాడు. ఐతే అతను కూడా ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సంజయ్‌ ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందు ఓ సెల్ఫీ వీడియో కూడా తీశాడు. అందులో సంజయ్‌ ఏడుస్తూ తాను కొందరికి అప్పు ఇచ్చాను వారు తిరిగి చెల్లించలేదని చెప్పాడు. దయచేసి నా పిల్లలు, నా కుమార్తె వివాహం కోసం నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి. ఆమె పెళ్లిని సుమారు రూ. 50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు పెట్టి జరిపించండి. నా కుమార్తె ఖాతాలో డబ్బు ఉంది. అలాగే లాకర్‌లో సుమారు రూ. 29 లక్షలు ఉందని, తన కూతురికి చాలా నగలు ఉన్నాయని చెప్పాడు.

పిల్లలు నన్ను క్షమించండి. నా భార్య, నేను బతకలేక వెళ్లిపోతున్నాం అని కన్నీటిపర్యంతమయ్యాడు. చివర్లో తాను బాగేశ్వర్‌ ధామ్‌ భక్తుడునని, గురూజీ నన్ను క్షమించండి మరో జన్మ లభిస్తే కచ్చితంగా మీకు మంచి భక్తుడిగా ఉంటానని వాపోయాడు. అలాగే సంఘటనా స్థలం వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ..ఈ ఘటన చాలా బాధకరం. ఇది గృహ వివాదానికి సంబంధించినదిగా గుర్తించాం. ఈ సంఘటనలో బయట వ్యక్తి ప్రమేయం లేదని ఎందుకంటే ఆ సమయంలో వారిద్దరే ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. 

(చదవండి:  మంత్రిపై ఏఎస్‌ఐ కాల్పులు.. ఛాతీలో దిగిన బుల్లెట్లు..)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు