స్థలం చూసోద్దామని చెప్పి...కిడ్నాప్‌ చేసి రూ.10 లక్షల వసూలు

30 May, 2022 10:14 IST|Sakshi

కెలమంగలం: ఫైనాన్సియర్‌ను కిడ్నాప్‌ చేసి రూ. 10 లక్షలు లాక్కొన్న ముగ్గురిని అంచెట్టి పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాలూకా కేంద్రం అంచెట్టి మరాఠీ వీధికి చెందిన వెంగోపరావ్‌ (44) ఫైనాన్సియర్‌. 9వ తేదీ కొందరు వెంగోపరావ్‌ ఇంటికెళ్లి విక్రయానికి ఉంచిన స్థలాన్ని చూద్దామని కారులో తీసుకెళ్లారు. దుండగులు బెంగళూరు సమీపంలోని అడవీ ప్రాంతానికి తీసుకెళ్లి రూ. 10 లక్షలు ఇస్తే వదిలేస్తామని, ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించడంతో భయపడిన అతను మిత్రునికి ఫోన్‌ చేసి రూ. 10 లక్షలు తెప్పించి వారికి అందజేశాడు.

దీంతో అతన్ని వదిలేశారు. వెంగోపరావ్‌ గత రెండు రోజుల క్రితం అంచెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి మిలిదిక్కి గ్రామానికి చెందిన గణేష్‌ (35), ఏరికొడి గ్రామానికి చెందిన శక్తివేల్‌ (30), పాండురంగన్‌కొటాయ్‌కు చెందిన శక్తి (28)లను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. 

(చదవండి: ప్రేక్షకులకు ఏమైంది?)

మరిన్ని వార్తలు