అస్సాంలో జేఈఈ టాపర్‌ అరెస్టు

29 Oct, 2020 06:27 IST|Sakshi

గువాహటి: తన బదులు మరొకరితో పరీక్ష రాయించి, అస్సాంలో జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ)–మెయిన్‌లో టాపర్‌గా నిలిచిన నీల్‌ నక్షత్ర దాస్‌ను అరెస్టు చేసినట్లు గువాహటి పోలీసులు బుధవారం తెలిపారు. ఈ పరీక్షలో నక్షత్ర దాస్‌ 99.8 శాతం పర్సంటైల్‌ సాధించి, అస్సాం రాష్ట్రంలో టాపర్‌గా నిలిచాడు. అతడు మరొకరితో పరీక్ష రాయించినట్లు విచారణలో తేలింది. అంటే కష్టపడి చదవకుండానే, పరీక్షకు హాజరు కాకుండానే టాప్‌ ర్యాంకు కొట్టేశాడన్నమాట. ఈ విషయంలో నక్షత్ర దాస్‌కు అతడి తండ్రి డాక్టర్‌ జ్మోతిర్మయి దాస్, పరీక్ష కేంద్రం నిర్వాహకులు హేమేంద్రనాథ్‌ శర్మ, ప్రాంజల్‌ కలితా, హీరూలాల్‌ పాఠక్‌ సహకరించినట్లు విచారణలో బయటపడింది. తన కుమారుడు నక్షత్రదాస్‌కు టాప్‌ ర్యాంకు రావడానికి తండ్రి జ్యోతిర్మయి దాస్‌ దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు