మచిలీపట్నంలో దారుణం..

30 Oct, 2020 13:23 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం (కృష్ణా జిల్లా): మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమారుడిపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంట్లో ఉన్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిసింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు