అతడికి 60.. ఒంటరిగా ఉన్న అమ్మాయిపై కన్నేసి..

30 Apr, 2022 07:49 IST|Sakshi

అనంతపురం క్రైం: బాలికతో వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన శుక్రవారం నగరంలో చోటుచేసుకుంది. వివరాల ప‍్రకారం.. త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ నగర్‌లో బాబూరావు (60) ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. కూతురు హైదరాబాదులో నివాసం ఉంటోంది.

బాబూరావు మద్యానికి బానిసయ్యాడు. ఇరుగుపొరుగు వారు ఇచ్చే భోజనం తిని, యాచిస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. శుక్రవారం నివాస ప్రాంతంలోని ఓ  ఇంట్లోకి ప్రవేశించాడు. బాలిక ఒంటరిగా కనిపించడంతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో బాలిక తల్లి అక్కడికి వచ్చి.. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున చేరుకున్నారు.

డయల్‌ 100కు సమాచారం అందించారు. త్రీటౌన్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌ తరలించారు. కేసును ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిశ పోలీస్‌ స్టేషన్‌కు బదలాయించారు. దిశ డీఎస్పీ శ్రీనివాసులు జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వృద్ధుడు బాబూరావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చదవండి: చక్రం తిప్పిన దివ్య హాగరగి.. హోం మంత్రి సంచలన ప్రకటన

మరిన్ని వార్తలు