మహిళలే టార్గెట్‌: తేనె అమ్ముతున్నట్లు నటిస్తూ..

6 Feb, 2021 10:00 IST|Sakshi

కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా): పూజల పేరుతో మాయమాటలు చెప్పి ఓ ఇంట్లో బంగారు వస్తువులు కాజేపే ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ సంఘటన శుక్రవారం కొలిమిగుండ్ల లో చోటు చేసుకుంది. ఇద్దరు మహిళా దొంగల్లో ఒక రు ఊర్లో తేనె అమ్ముతున్నట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసుకున్నారు. ఈ కోవలోనే పెద్దమ్మ ఆలయం సమీ పంలోని వీధిలో నివాసముండే శ్రావణితో చిత్తూరు లక్ష్మి అనే దొంగ ఇంట్లోకి వెళ్లి పూజలు చేస్తే నీభర్త ఆరోగ్యం బాగుపడుతుంది. అంతా శుభం జరుగు తుందని పూజల పేరుతో మరొక మహిళ ఇంట్లోకి చేరింది. (చదవండి: కిడ్నాప్‌ డ్రామా: నివ్వెరపోయే విషయాలు

వారి మాటలు నమ్మి  పూజకు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బంగారు కూడా పెట్టాలని చెప్పడంతో నమ్మి అక్కడే ఉంచింది. ఆమె దృష్టి మరల్చి రోల్డ్‌గోల్డ్‌ వస్తువులను పెట్టి అసలు వస్తువులను బ్యాగులో వేసుకుంది. అక్కడి నుంచి బయట పడేందుకు కిలాడీ లేడి ఇంకో చోట పూజ చేయాలి త్వరగా వస్తానని ప్రధాన రహదారిపైకి చేరి కానిస్టేబుల్‌ సుబ్బరాయుడు మఫ్టీలో బైక్‌లో వెళ్తుండడంతో ఆపి ఎక్కింది. బాధితురాలు శ్రావణి పక్కింట్లో ఉండే మరో మహిళ బంగారు తీసుకెళుతోందని  కేకలు వేయడంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్‌ బైక్‌ను వెనక్కి తిప్పి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఏటీఎం వద్దకు రాగానే కిందకు దూకే ప్రయత్నం చేసింది.  అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.(చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..)  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు