ఇన్‌స్ట్రాగాంలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. ఆటోలో తీసుకెళ్లి..

11 Jun, 2022 11:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సైదాబాద్‌(హైదరాబాద్‌): మాయమాటలు చెప్పి ఓ బాలికను పెళ్లి చేసుకున్న ఆటో డ్రైవర్‌ను సైదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖాజాబాగ్‌కు చెందిన బాలిక(13) ఆరోతరగతి చదువుతుంది.  గురువారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తుండగా ఆటోలో వెళ్లినట్లు చూశామని స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు.
చదవండి: యువకుడి పాడుపని.. వివాహిత ఇంటికెళ్లి.. చేయి పట్టుకుని..

దీంతో వారు సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు ఆటో గౌరెల్లికి చెందిన శ్రీకాంత్‌కు చెందినదిగా గుర్తించారు. ఇన్‌స్ట్రాగాంలో బాలికతో పరిచయం కావడంతో శ్రీకాంత్‌ తరచూ ఆమె నివసించే ప్రాంతానికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో బాధితురాలికి మాయమాటలు చెప్పి గురువారం  ఆటోలో తీసుకువెళ్లి గుడిలో పెళ్లి చేసుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు