చదివింది ఎంబీఏ.. లా‍క్‌డౌన్‌ దెబ్బకి దొంగగా మారాడు

1 Aug, 2021 21:37 IST|Sakshi

బెంగళూరు: లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కొందరు ఉపాధి లేక కూలి పనులు చేసుకోగా, మరికొందరు వారి చదువు కన్నా తక్కువ స్థాయి పని చేస్తూ రోజులు గడుపుతున్నారు, ఇంకొందరు ఉద్యోగ సమయంలో చేసిన అప్పులు తీర్చలేక అడ్డదారులు తొక్కుతున్నారు. అలా ఓ ఎంబీఏ చదివిన యువకుడి ఉన్న ఉద్యోగం పోవడంతో దొంగగా మారి కటకటలా పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని బనశంకరిలో చోటు చేసుకుంది.

అతడు ఎంబీఏ చదివి ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం చూస్తూ కాలం గడుపుతున్న ఆ యువకుడికి కరోనా దెబ్బతో కష్టాలు మొదలయ్యాయి. దీంతో చైన్‌స్నాచర్‌ అవతారం ఎత్తాడు. జయనగర పూర్ణిమా కన్వెన్షన్‌ హాల్‌ నుంచి వస్తున్న మహిళ మెడలో బంగారుచైన్‌ లాక్కుని పారిపోయిన షేక్‌ గౌస్‌ అనే చోరున్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు ప్రశ్నించగా తన దయనీయ గాథ చెప్పాడు. సార్‌ నేను ఎంబీఏ పూర్తి చేశా. కరోనా లాక్‌డౌన్‌ వల్ల నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. రూ.35 వేల అప్పు ఉంది. అప్పుల వాళ్ల వేధింపులు తీవ్రమయ్యాయి. వేరే ఉద్యోగాలేవీ దొరకలేదు. దీంతో చైన్‌స్నాచింగ్‌ చేశానని చెప్పాడు. 


 

మరిన్ని వార్తలు