‘నేను లండన్‌లో ఉంటా, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా’

12 Jun, 2021 15:42 IST|Sakshi

పెళ్లి పేరుతో రూ.10 లక్షలు స్వాహా  

సాక్షి, బెంగళురు(బనశంకరి): నేను లండన్లో నివసిస్తుంటా, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంచకుడు ఓ మహిళ నుంచి రూ.10.13 లక్షలు స్వాహా చేశాడు. బెంగళూరు గురురాఘవేంద్ర లేఔట్‌ నివాసి తానియా రై బాధిత మహిళ. కొద్దిరోజుల క్రితం ప్రేమ్‌ బసు అనే వ్యక్తి ఒక పెళ్లి సంబంధాల వెబ్‌సైట్లో పరిచయమయ్యాడు.

లండన్‌లో ఉంటున్నట్లు చెప్పాడు. మీరు నచ్చారని, భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పడంతో మహిళ నిజమేననుకుంది. మరుసటి రోజు ఆమె మొబైల్‌కు ఫోన్‌ చేసిన వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయ అధికారి అని పరిచయం చేసుకున్నాడు. లండన్‌ నుంచి ప్రేమ్‌బసు వచ్చారని, అతడి వద్ద  కరోనా నెగిటివ్‌ రిపోర్టు లేదని, రూ.2 కోట్ల నగదు ఉందని, దీనికి సరైన పత్రాలు లేకపోవడంతో అతడిని అరెస్ట్‌ చేశామని చెప్పాడు. అతడిని విడుదల చేయాలంటే కొంత పన్ను కట్టాలన్నాడు. తానియా రై అతనికి సాయం చేద్దామని రూ.10.13 లక్షల నగదును ఖాతాలోకి బదిలీ చేసింది. తరువాత ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ అని రావడంతో బాధితురాలికి దిక్కుతోచలేదు. సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.  

చదవండి: స్విగ్గీ డెలివరీ బాయ్‌ని చితకబాది.. నగదు చోరీ

మరిన్ని వార్తలు