బంగారం కొట్టేసి.. బంధువులకు నగలు

5 Jul, 2021 16:45 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని గోరేగావ్‌ (వెస్ట్‌)లో రజిన నర్సయ్య మెంగు(32) అనే మహిళను బంగూర్‌ నగర్‌ పోలీసులు చోరీ కేసులో అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రమ్ని అయ్యర్(60) తన భార్య, 83 ఏళ్ల తల్లితో కలిసి బంగూర్ నగర్‌లో ఉంటున్నాడు. అదే ప్రాంతంలో, ఎన్నారై అయిన అతని తమ్ముడు కుమార్ సుబ్రమణ్యం అయ్యర్‌కు ఇల్లు ఉంది. కుమార్ విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులను కూడా అయ్యర్ ఇంట్లో ఉంచారు. కుమార్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. కాగా, రజితా మెంగు(32) అనే మహిళ ఇద్దరు సోదరుల వద్ద పనిచేస్తుంది. అయితే అయ్యర్ తన అల్మరా లాకర్‌ విలువైన వస్తువులు, పత్రాలు, డబ్బును ఉంచేవాడు. కానీ, జూన్ 29న రూ. 21.5 లక్షల విలువైన ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, ఇతర విలువైన వస్తువులు కనిపించలేదు. దీంతో బంగూర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇలా తెలిసింది
" మెంగు కొడుకుని ఇంటి యజమాని ఊరిలో ఎలా గడిచిందని అడగటంటో.. ఆ పిల్లవాడు ఇంటి దగ్గర బంధువులకు మెంగు బంగారు  ఆభరణాలు ఇచ్చినట్లు చెప్పాడు. అంతే కాకుండా ఈ మధ్యనే మెంగు ఇంటి మరమ్మతు పనులు కూడా మొదలుపెట్టింది. దీంతో అనుమానం వచ్చి అయ్యర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు మెంగును అరెస్టు చేసి ప్రశ్నించారు. దీంతో ఆమె చోరీ చేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు మెంగు గ్రామానికి వెళ్లి ఆమె బంగారు బిస్కెట్లు అమ్మిన ఆభరణాల నుంచి 19 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.’’  అని బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్  సీనియర్ ఇన్‌స్పెక్టర్ శోభా పైన్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ అమర్ ధెంగే తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు