బంజారాహిల్స్‌: ప్రియుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

26 Jun, 2021 10:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: ప్రేమికుడి లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌లో ఉండే ఇంటర్‌ విద్యారి్థని(16)కి నెల రోజుల క్రితం మెహిదీపట్నానికి చెందిన విద్యార్థి సమద్‌(22)తో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, కొన్ని రోజులుగా సమద్‌ ప్రేమ ముసుగులో బాలికను లైంగికంగా లోబర్చుకొనేందుకు యత్నిస్తుండగా నిరాకరిస్తూ వచ్చింది.

తనతో రాకపోతే  ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. అతడి వేధింపులతో శుక్రవారం తెల్ల వారుజామున బాలిక తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమద్‌ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా బాలిక సూసైడ్‌ నోట్‌ రాసింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

చదవండఙ: భర్త, అత్తమామల వేధింపుల: ఎందుకిలా చేశావు తల్లీ..! 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు