Banjara Hills: గుళ్లో పూజారిని, మామిడాకులు కావాలంటూ..

4 Aug, 2021 11:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: తాను పూజారినని ఆలయానికి కట్టేందుకు మామిడాకులు కావాలంటూ వచ్చిన ఓ వ్యక్తి మహిళను మోసం చేసి నగలుఎత్తుకెళ్లాడు. బంజారాహిల్స్‌పోలీస్‌ పోలీసులు తెలిపిన మేరకు.. వెంకటేశ్వరనగర్‌లో నివసించే గుదిబండ రేణుక(28) ఇంటికి గుర్తు తెలియని యువకుడు వచ్చి తాను బాబా నాయక్‌ ఇంటి వద్ద గుడి పూజారినని మామిడాకులు కావాలని చెప్పాడు. మాటల సందర్భంలో మీకు మంచి రోజులు వస్తాయని చెప్పాడు. ఆభరణాలు ఇస్తే పూజలు చేసి తీసుకొస్తానని నమ్మించాడు. దీంతో ఆమె మూడు తులాల గొలుసుతో పాటు నెక్లెస్, వెండి ఆభరణాలను మూటగట్టి ఇచ్చింది. రెండు గంటలు గడిచినా పూజారి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీటి విలువ రూ.2.90 లక్షలు ఉంటుందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

కేవైసీ అప్‌డేట్‌ అంటూ..
బంజారాహిల్స్‌: మీ కేవైసీకి సంబంధింన లింక్‌ ఇచ్చాం. దాన్ని అప్‌డేట్‌ చేయండి అంటూ వ్చన మెసేజ్‌ ఓ వ్యాపారి వివరాలు నమోదు చేసిన మరుక్షణంలోనే  డబ్బు మాయమయ్యాయి.  దీంతో బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఎల్వీ ప్రసాద్‌ఆస్పత్రి సమీపంలో శ్రీరామ మౌంట్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో నివసించే వ్యాపారి వి. రామకృష్ణ(67)కు ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి ఓ మెసేజ్‌ వచ్చింది. మీ కేవైసీ లింక్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలంట దాని సారాంశం. ఆయన లింక్‌ను ఓపెన్‌ చేసి ఆ మెసేజ్‌ను చదివి అడిగిన వివరాలు నమోదు చేశాడు. క్షణాల్లోనే ఆయన అకౌంట్‌ నుంచి ర. 20 వేలు రెండు సార్లు, ర. 9099 మరోసారి డెబిట్‌ అయ్యాయి. ఎస్‌బీఐ అధికారులకు సవచారం ఇచ్చారు. అనంతరం సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు