స్వలింగ సంపర్కం.. బ్యాంక్‌ అధికారి నిర్వాకం

11 Sep, 2020 11:26 IST|Sakshi

ఆన్‌లైన్‌లో విటుడ్ని బుక్‌చేసుకున్న ప్రబుద్ధుడు 

సాక్షి, అమీర్‌పేట(హైదరాబాద్‌) : స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డ ఓ బ్యాంకు అధికారి ఆన్‌లైన్‌లో విటుడ్ని బుక్‌ చేసుకుని  న్యూసెన్సు చేశాడు. దీంతో పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. వనస్థలిపురం ఆంధ్రాబ్యాంక్‌ శాఖలో పనిచేసే ఉన్నతాధికారి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడు. ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేసి ఎస్‌ఆర్‌నగర్‌ సమీపంలోని బస్తీకి చెందిన విటుడ్ని 5 వేలకు బుక్‌ చేసుకున్నాడు. (చదవండి: కరోనా రాకుండా తండ్రికి విషమిచ్చి..)

విటుడ్ని కలిసేందుకు ఆ అధికారి ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి 3 గంటల సమయంలో బస్తీకి వచ్చాడు. ఓ ఇంట్లోని మొదటి అంతస్తులో ఉన్న విటుడి వద్దకు వెళ్లాడు. అతడు వికలాంగుడు కావడంతో నిర్ఘాంతపోయిన బ్యాంకు అధికారి వెనుతిరిగాడు. అయితే డబ్బు ఇవ్వాల్సిందేనని వికలాంగుడు పట్టుబట్టడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ పెద్దది కావడం, ఇదే సమయంలో మంచినీటి సరఫరా జరుగుతుండంతో నీళ్లు పట్టుకునేందుకు బయటికి వచ్చిన మహిళలు దొంగేమోనని అనుమానించి అధికారిని పట్టుకున్నారు. 100కు డయల్‌ చేయడంతో పెట్రోలింగ్‌ సిబ్బందికి అక్కడకు చేరుకుని బస్తీలో న్యూసెన్సుకు పాల్పడ్డ ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తరలిం​చారు. 8వ తేదీన బ్యాంకు అధికారితో పాటు విటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: రాచకొండలో నకిలీ డాక్టర్‌ హల్‌చల్)‌  

మరిన్ని వార్తలు