కర్ణాటకలో బ్లాయిమెయిల్‌: 400 సీడీలున్నాయి!

22 Mar, 2021 08:45 IST|Sakshi

శివాజీనగర: మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి రాసలీల సీడీ కేసు పేలగానే రాష్ట్ర వ్యాప్తంగా వీడియోల గోల మిన్నంటింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఆయన విజయపుర నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నాయకులకు సంబంధించి మరో 400 సీడీలున్నాయని విధానసౌధలోనే గుసగుసలున్నాయి. ముఠాలుగా ఏర్పడి ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తున్నారు.

పని ఉందని ఎమ్మెల్యేలను పరిచయం చేసుకొంటారు. పరిచయం పెంచుకొని సీడీ చేసి, బెదిరింపులకు దిగుతారు. కర్ణాటకలో పెద్ద సీడీ గ్యాంగ్‌ ఉంది. రాజకీయ నాయకులు, అధికారులు, సినిమా స్టార్లను బ్లాక్‌మెయిల్‌ చేసే ముఠాలున్నాయి, ఇదొక కొత్త రకం వ్యాపారంగా మారింది’ అని ఆయన  తెలిపారు. జార్కిహొళి కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. సీబీఐ ద్వారా మాత్రమే నిజాలు వెల్లడవుతాయని సిట్‌ మీద విశ్వాసం లేదని తెలిపారు.
చదవండి: సీడీలను బయటపెట్టరాదని కోర్టుకు వెళ్లారు

మరిన్ని వార్తలు