ఫేస్‌బుక్‌ స్నేహం.. అశ్లీల వీడియోలతో మోడల్‌కు బెదిరింపులు

13 Nov, 2021 16:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులో వెలుగు చూసిన ఘటన

ఔత్సాహిక మోడల్‌కు మహిళ బెదిరింపులు

బెంగళూరు: ఆన్‌లైన్‌ స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికి.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. సమాజంలో ఈ తరహా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బెదిరింపులకు పాల్పడే వారిలో ఆడా, మగా అనే తేడా లేదు. తాజాగా ఈ కోవకు చెందిన కేసు ఒకటి బెంగళూరులో వెలుగు చేసింది.

ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన ఓ మహిళ.. స్నేహం ముసుగులో మంచిదానిగా నటిస్తూ.. మోడల్‌కు దగ్గరయ్యింది. ఆ తర్వాత మార్ఫ్‌డ్‌ వీడియోలతో ఆమెను బెదిరించసాగింది. మోడల్‌ ఫిర్యాదుతో పోలీసుల సదరు మహిళ మీద కేసు నమోదు చేశారు. ఆ వివరాలు...

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఔత్సాహిక మోడల్‌కు ఫేస్‌బుక్‌లో నిందితురాలు సోనియా పర్నడీస్‌తో పరిచయం ఏర్పడింది. బాధితురాలు మోడలింగ్‌ అవకాశాల కోసం ప్రయత్నిస్తుండటంతో.. సోనియా దాన్ని అవకాశంగా మార్చుకుంది. బాధితురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంపితే.. తనకు మోడలింగ్‌ అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికింది. 
(చదవండి: ఆ ఫోటో చూసి సెట్స్‌లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్‌)

ఆమె మాటలు నమ్మిన బాధితురాలు కొన్ని రోజుల క్రితం సోనియాకు తన వీడియోలు, ఫోటోలు పంపించింది. సోనియా తనకు మోడలింగ్‌ అవకాశాలు ఇప్పిస్తుందని నమ్మకంగా ఉంది బాధితురాలు. ఈ క్రమంలో ఆమెకు అనుకోని షాక్‌ తగిలింది. తాను పంపిన ఫోటోలు, వీడియోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫ్‌ చేసి.. బాధితురాలి మొబైల్‌కి సెండ్‌ చేసింది సోనియా.
(చదవండి: ఫ్యామిలీ గ్రూప్‌లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు)

వాటిని చూసిన బాధితురాలు షాక్‌ అయ్యింది. తేరుకునేలోపే సోనియా బాధితురాలికి కాల్‌ చేసి.. ‘‘నీ నగ్న చిత్రాలు పంపకపోతే.. ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానని’’ బెదిరించసాగింది. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో.. సోనియాపై కేసు నమోదు చేశారు పోలీసులు.

చదవండి: యువతి బ్లాక్‌మెయిల్‌: డబ్బులు పంపించు.. లేదంటే..

మరిన్ని వార్తలు