తొమ్మిదేళ్ల ప్రేమ,పెళ్లికి ఒప్పుకోలేదని.. బంధువులకు వాయిస్‌ సందేశం పంపించి..

1 Jun, 2022 12:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి(బెంగళూరు): తొమ్మిదేళ్ల పాటు ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువకుడు డెత్‌నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు ఎన్‌ఆర్‌.పుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. చేతన్‌ (31) ఆత్మహత్య చేసుకున్న యువకుడు. గానవి అనే యువతి, చేతన్‌ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉంటే గానవి తన నుంచి రూ. 4 లక్షలు తీసుకుందని, బంధువులకు వాయిస్‌ సందేశం పంపించి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు  దర్యాప్తులో ఉంది. 

మరో ఘటనలో..

స్నేహితునిపై యాసిడ్‌ దాడి
శివాజీనగర: కబ్బన్‌ పేట 10వ క్రాస్‌లో యాసిడ్‌ దాడి ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితుడు జనతా అదక్, స్నేహితుడు వెండి పాలిష్‌ షాపులో పనిచేసేవారు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. వెండి పాలిష్‌కు ఉపయోగించే తేలికపాటి యాసిడ్‌ను అదక్‌ తన మిత్రునిపై పోశాడు. బాధితుని ముఖం, ఎద తదితర భాగాలపై 30 శాతం కాలిన గాయాలయ్యాయి. బాధితుడు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదక్‌ మైసూరు వద్ద పరారీలో ఉండగా హలసూరు గేట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు