రూ.90 లక్షల విలువైన గంజాయి స్వాధీనం 

22 May, 2022 01:59 IST|Sakshi
భద్రాచలంలో స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనంతో ఎక్సైజ్‌ ఉద్యోగులు   

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎక్సైజ్‌ అధికారులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.90 లక్షల విలువైన 300 కేజీల గంజాయి పట్టుబడింది. వివరాలివి. ఎక్సైజ్‌ సీఐ రహీమున్నీసా బేగం సిబ్బందితో కలిసి శనివారం తెల్లవారుజామున కూనవరం రోడ్డులో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించగా ఆగకుండా దూసుకుపోయింది.

దీంతో ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునే క్రమంలో ఎక్సైజ్‌ అధికారుల వాహనం ముందు భాగం దెబ్బతింది. అక్కడి నుంచి పారిపోయిన నిందితుల వాహనం కోసం గాలిస్తుండగా రామాలయం వద్ద కనిపించింది. దాన్ని తనిఖీ చేయగా 300 కేజీల గంజాయి లభించడంతో సీజ్‌ చేశారు. పట్టుబడిన వాహనం జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందినదని గుర్తించామని, నిందితులు పారిపోయారని సీఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు