భద్రాద్రి కొత్తగూడెం: అప్పు తీర్చలేదని మహిళపై..

3 May, 2022 10:34 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆర్థిక లావాదేవీలతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలంలో పరిధిలో ఈ దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేశాడో వ్యక్తి.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

శ్రీదేవి అనే మహిళ తన దగ్గర అప్పు తీసుకుందని, తిరిగి ఇవ్వమంటే జాప్యం చేస్తోందని నిందితుడు నవతన్‌ చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేశాడట. శ్రీదేవిపై కత్తి దాడి స్థానికంగా కలకలం సృష్టించగా.. ఘటనపై నవతన్‌పై కేసు నమోదు చేశారు చంచుపల్లి పోలీసులు. ఈలోపే నవతన్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

మరిన్ని వార్తలు