భువనగిరిలో కిడ్నాప్‌.. సింగరాయకొండలో పట్టివేత

19 May, 2022 05:52 IST|Sakshi
కిడ్నాప్‌ అయిన బాలుడు

సింగరాయకొండ: తెలంగాణలోని భువనగిరిలో కిడ్నాప్‌ అయిన బాలుడు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పొనుగోటివారిపాలేనికి చెందిన గద్దాల మహేష్‌ తెలంగాణలోని జనగాం మండలం భువనగిరి పట్టణానికి బేల్దారి పని కోసం వెళ్లాడు.

10 రోజుల క్రితం మహేష్‌ స్వగ్రామానికి వచ్చేప్పుడు మూడేళ్ల బాలుడిని వెంట తీసుకొచ్చాడు. బుధవారం మహేష్‌ బాలుడిని తన తమ్ముడు రమేష్‌ వద్ద వదిలి ఊరికి వెళ్లటానికి ప్రయత్నించగా.. అందుకు రమేష్‌ నిరాకరించడంతో వీరిద్దరి మధ్య వాదులాట జరిగింది. దీంతో అసలు విషయం బయటపడింది. మహేష్‌ తను పనిచేస్తున్న చోట బాలుడిని కిడ్నాప్‌ చేసి కొద్ది రోజుల తరువాత స్వగ్రామానికి తీసుకుని వచ్చాడని పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు