లేదండి ప్రధాని నాకోసం ఆ పైసలు పంపారు.. తిరిగి ఇవ్వను

15 Sep, 2021 16:22 IST|Sakshi

పట్నా: ఇటీవల బ్యాంక్‌ ఖాతాలో చిన్న చిన్న తప్పుల కారణంగా మన ఖాతాలో డబ్బులు మాయమవడం, లేదా ఇంకొకరి ఖాతా నుంచి మన ఖాతాలోకి రావడం జరుగుతుంటుంది. అయితే ఈ రకంగా తన ఖాతాలో వచ్చిన డబ్బుని తిరిగి ఇవ్వనంటూ బ్యాంక్‌ అధికారులను ముప్పు తిప్పలు పెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఖ‌గారియా జిల్లాకు చెందిన రంజిత్ దాస్ అనే వ్య‌క్తి బ్యాంక్ ఖాతాలోకి ఇటీవల 5.5 ల‌క్ష‌లు క్రెడిట్ అయ్యాయి.

అయితే బ్యాంక్  సిబ్బంది చేసిన పొరపాటు వ‌ల్ల ఆ డబ్బు అత‌ని ఖాతాలో ప‌డింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అతనికి నోటీసులు పంపిన స్పందించలేదు. అనంతరం వారు జరిగిన విషయాన్ని దాస్‌కి వివరించి డ‌బ్బును వాప‌స్ ఇవ్వాలని కోరగా అత‌ను నిరాక‌రించాడు. అందుకు బదులుగా అతను.. ఇది ప్ర‌ధాని పంపిన డ‌బ్బు అని, తిరిగి ఇచ్చే ప్రసక్తే లేద‌న్నాడు.

బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుపై రంజిత్ దాస్‌ను అరెస్టు చేసి పోలీసులు విచారించగా.."ఈ సంవత్సరం మార్చిలో అకస్మాత్తుగా నా బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు చేరాయి. అందుకు చాలా సంతోషించాను. గతంలో ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు కదా, కనుక ఇది మొదటి విడత కావచ్చునని నేను అనుకున్నాను. అలా భావించి డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసాను. ఇప్పుడు, నా ఖాతాలో దగ్గర డబ్బు లేవని‘‘ దాస్ తెలిపాడు. 

చదవండి: పాక్‌ ఏజెంట్లకు రహస్య సమాచారం.. నలుగురు డీఆర్‌డీఓ ఉద్యోగుల అరెస్టు

 

మరిన్ని వార్తలు